World Cup 2023 FINAL : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ తుది దశకు వచ్చింది. ఇవాళ ఈ టోర్నమెంట్లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్టు తలపడనున్న సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్… గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇవాల్టి మ్యాచ్లో టాస్ గెలిచినట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో భారత టీంలో మార్పులు జరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. సూర్య కుమార్ స్థానంలో రవిచంద్రన్ అశ్వన్ ను తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం అందుతోంది.