15-18 వ‌య‌స్సు వారికి టీకా.. కోవిన్ యాప్‌లో ల‌క్ష‌ల్లో రిజిస్ట్రేష‌న్లు

-

దేశంలో క‌రోనా, ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండ‌టంతో 15 నుంచి 18 ఏళ్ల లోపు ఉన్న పిల్ల‌లు అంద‌రికీ వ్యాక్సిన్లు ఇవ్వాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగా జ‌న‌వ‌రి 1 నుంచి 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న వారు కోవిన్ యాప్ లో రిజిస్ట్రేష‌న్లు చేసుకుంటున్నారు. అయితే జ‌న‌వ‌రి 1 నుంచి నేడు మ‌ధ్యాహ్నం వ‌ర‌కు అంటే కేవ‌లం 36 గంట‌ల‌ల్లోనే దాదాపు 4.5 ల‌క్ష‌ల మంది 15 నుంచి 18 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న వారు రిజిస్ట్రేష‌న్ చేసుకున్నార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

కాగ రేప‌టి నుంచి 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య ఉన్న పిల్లలకు కేంద్ర ప్ర‌భుత్వం వ్యాక్సిన్స్ ఇవ్వ‌నుంది. అయితే 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య ఉన్న పిల్లల‌కు వ్యాక్సిన్స్ గురించి ఎలా అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ఆలోచిస్తున్న స‌మ‌యంలో ఇలాంటి రెస్పాన్స్ రావ‌డంతో ఆశ్చ‌ర్య‌పోయారు. అయితే వీరంద‌రూ చ‌దువుకున్న వాళ్లు కావ‌డంతో పాటు త‌ల్లి దండ్రుల నుంచి కూడా ప్రోత్స‌హం ఉండ‌టం వ‌ల్లే ఇంత మంది రిజిస్ట్రేష‌న్ చేసుకున్నార‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version