టాటూ పార్లర్‌ల ఎదుట పోలీసుల క్యూ.. ఎందుకంటే?

-

ఒడిశా పోలీసులు స్పెషల్‌ సెక్యూరిటీ బెటాలియన్‌కు (SSB) షాక్ ఇచ్చారు. టాటూ వేయించుకున్న పోలీసులు వెంటనే వాటిని తొలగించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అందుకు చాలా తక్కువ సమయాన్ని ఇచ్చారు. తక్కువ గడువు పెట్టడంతో టాటూ పార్లర్‌ల వద్ద పోలీసులు క్యూ కట్టారు. ఇంతకీ ఉన్నఫళంగా పచ్చబొట్లను తొలగించాలని ఆదేశించడానికి గల కారణాలేంటి?

రాష్ట్రంలో చాలామంది పోలీసులు యూనిఫాం వెలుపల పచ్చబొట్లు వేయించుకున్నారని, సిబ్బంది టాటూ వేయించుకోవడం పరిశీలకుల దృష్టిలో చెడు అభిప్రాయం ఏర్పరిచే అవకాశం ఉందని డీఎస్పీ సుధాకర్ మిశ్రా అన్నారు. ఇది జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధుల ఎదుట ఒడిశా పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు. అందుకే ఈ ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. టాటూలను తొలగించుకునేందుకు 15 నుంచి 20 రోజుల గడువు విధించామని వెల్లడించారు.

ఎస్‌ఎస్‌బీ ఆదేశాల మేరకు పోలీసులు టాటూ పార్లర్‌లకు క్యూ కట్టారు. పచ్చబొట్టు సమూలంగా తొలగించాలంటే లేజర్‌ చికిత్స అవసరం. 20 రోజుల వ్యవధిలో నాలుగు సెషన్లలో వీటిని తొలగిస్తారు. ఇందుకు అయ్యే ఖర్చు కూడా ఎక్కువే.

Read more RELATED
Recommended to you

Exit mobile version