FASTag : వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఫాస్టాగ్‌కు ఆటోమేటిక్ రీఛార్జి.. ఆర్‌బీఐ అనుమతులు ఇచ్చేసింది..!

-

FASTag : రహదారులపై ప్రయాణించే వాహనదారులకి ఫాస్టాగ్ తప్పనిసరి టోల్ ప్లాజా దగ్గర వేగంగా వెళ్లడానికి ఫాస్టాగ్ చాలా ఉపయోగపడుతుంది. కేంద్రం ఎప్పటికప్పుడు ఈ ఫాస్టాగ్ విషయంలో కొత్త మార్పులు తీసుకు వస్తోంది. ఫాస్టాగ్ రీఛార్జి విషయంలో ఇబ్బందుల్ని తొలగించాలని చాలా రోజుల నుండి డిమాండ్లు కూడా ఉన్నాయి. అయితే ఈ క్రమంలో వాహనదారులకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. ఆటోమేటిక్ గా రీఛార్జ్ చేసుకోవడానికి అనుమతులని ఇచ్చింది. తాజాగా ఫాస్టాగ్ ఆగ్నేషనల్ కామన్ మొబిలిటీ కారులను ఆటోమేటిక్ గా రీఛార్జ్ చేసేలా అనుమతించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తగిన విధంగా ఈ మాండేట్ వ్యవస్థలో మార్పులు చేసింది.

24 గంటల పాటు వేచి చూడాల్సిన అవసరం లేకుండా చేశారు. ఆటోమేటిక్ గా రీఛార్జ్ చేసే వీలు కల్పించడంతో అత్యవసర సమయంలో టోల్ ప్లాజా దగ్గర రద్దీ తగ్గిపోతుంది అని వాహనదారులు తెలిపారు. ఇప్పటివరకు ఈ మ్యాండేడ్ వ్యవస్థలో వాహనదారుల ఖాతాల నుంచి వాటిలోకి నగదు డెబిట్ అవ్వడానికి కనీసం 24 గంటల ముందు ఒక డెబిట్ నోటిఫికేషన్ అవసరమయ్యేది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.

ఈ క్రమంలోనే ఫాస్టాగ్ నేషనల్ కామన్ మొబిలిటీ కార్డులతో ఆటోమేటిక్గా రీఛార్జ్ చేసుకునేలా అనుమతిస్తామని కొద్ది రోజుల క్రితం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. అందుకు తగ్గట్టుగా వాహనదారులు నిర్దేశించిన లిమిట్ కంటే తక్కువకు బ్యాలెన్స్ తగ్గినప్పుడు ఈ మ్యాండేడ్ వ్యవస్థ కింద ఆటో రిప్లెనిష్‌మెంట్‌ కు వీలు కల్పించాలని నిర్ణయించినట్లు RBI గురువారం తెలిపింది. ఇక మీదట బ్యాలెన్స్ అయిపోతుందని ఆందోళన పడక్కర్లేదు. టోల్ గేట్ల వద్ద ఎలాంటి అవాంతరాలు లేకుండా వేగంగా వెళ్లొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news