అకౌంట్లో రూ.900 కోట్లు..! అవాక్కైనా ఆరో త‌ర‌గ‌తి విద్యార్దులు

-

అకస్మాత్తుగా మీ అకౌంట్లో కోటి రూపాయాలు వ‌చ్చిప‌డ్డాయనుకుందాం! అప్పుడు మీ ఫీలింగెంటీ.. మీ ఆనందానికి అవధులుండవు కదా..!! అదే మీ అకౌంట్లో వంద‌ల కోట్లు వ‌చ్చిప‌డితే.. ఎలా ఉంటుంది. అస‌లు మీ ఆశ‌లకు, ఊహాల‌కు హ‌ద్దు ఉండ‌దు కాదా! అస‌లు భూమిపై ఉండగలరా.. ?? అలాంటి విచిత్రం అనుభ‌వం ఆరో త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ విద్యార్థికి ఎదురైంది. త‌న అకౌంట్లో ఒక‌ట్రెండు కోట్లు కాదు.. ఏకంగా రూ . 900 కోట్లు జ‌మయ్యాయి. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు తమకు కూడా అలాంటి అదృష్టం వరించిందేమోనని ఏటీఎం ముందు బారులు తీరారు. ఈ ఘ‌టన బీహార్‌లోని కటిహార్‌లో గ్రామంలో జరిగింది.

వివ‌రాల్లోకెళ్తే.. కటిహార్‌లోని అజమ్‌నగర్ బ్లాక్‌లోని పాస్టియా గ్రామంలో ఆశిష్, గురు చరణ్ విశ్వాస్ లు 6 వ తరగతి చదువుతున్నారు. అయితే.. బీహార్ రాష్ట్ర ప్ర‌భుత్వం.. విద్యార్దుల స్కూల్ దుస్తువుల కొనుగోలు కోసం కొంత మొత్తాన్ని విద్యార్దుల అకౌంట్లో జ‌మా చేస్తుంది. అయితే.. ఆశిష్‌, గురుచ‌ర‌ణ్ విశ్వాస్ లు కూడా స్కూల్ దుస్తువుల సంబంధిత డబ్బులు వారి అకౌంట్లో జమ అయ్యిందో లేదో తెలుసుకునేందుకు ఇంటర్నెట్‌ కేంద్రానికి వెళ్లి చెక్ చేసుకున్నారు.

ఆ సమయంలో ఆరో తరగతి చదువుతోన్న ఆశిశ్‌ అనే విద్యార్ధి ఖాతాలో రూ.6.2 కోట్లు, గురు చరణ్ విశ్వాస్ ఖాతాకు రూ.900 కోట్లు ఉన్నట్లు గుర్తించారు. అకస్మాత్తుగా వచ్చి పడ్డ డబ్బులను చూసి, అటు కుటుంబ సభ్యులు, గ్రామ‌స్థులు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో తమ ఖాతాల్లో కూడా అలాంటి అద్బుతం జరిగిందేమోనని గ్రామస్థులు ఏటీఎంల వద్దకు బారులు తీరారు. ఈ విష‌యాన్ని తెలుసుకున్న సంబంధిత‌ బ్యాంక్ మేనేజర్ సాంకేతికలోపంతోనే అలా జరిగిందని తెలిపారు. ఇద్దరు పిల్లల బ్యాంక్ అకౌంట్లు నిలిపివేసిన‌ట్టు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version