భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు

-

సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. ఆలయం తెరుచుకున్న రోజు నుంచే ఈ పుణ్యక్షేత్రానికి అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి శబరిమలకు బయల్దేరుతున్నారు. ఈ క్రమంలో భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపింది.

ఈ నెల 26న, డిసెంబరు 3వ తేదీల్లో సికింద్రాబాద్‌-కొల్లం; ఈ నెల 28, డిసెంబరు 5న కొల్లం-సికింద్రాబాద్‌; ఈ నెల 26, డిసెంబరు 3న నర్సాపూర్‌-కొట్టాయం; ఈ నెల 27, డిసెంబరు 4v కొట్టాయం-నర్సాపూర్‌ ; ఈ నెల 22, 29 డిసెంబరు 6న కాచిగూడ-కొల్లం ; ఈ నెల 24, డిసెంబరు 1, 8న కొల్లం-కాచిగూడ; ఈ నెల 23, 30న కాకినాడ-కొట్టాయం ; ఈ నెల 25, డిసెంబరు 2న కొట్టాయం-కాకినాడ; సికింద్రాబాద్‌-కొల్లం ఈ నెల 24, డిసెంబరు 1; కొల్లం-సికింద్రాబాద్‌ ఈ నెల 25, డిసెంబరు 2 తేదీల్లో ప్రత్యేక రైళ్లు ఉంటాయి. వీటిలో ఫస్ట్‌, సెకండ్‌, థర్డ్‌ ఏసీ బోగీలతో పాటు స్లీపర్‌, జనరల్‌ కోచ్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news