పాక్​పై​ ధావన్ ఫన్నీ ట్వీట్.. ముగింపు లేని లవ్​ స్టోరీ అంటూ..!

-

ఇండియాకు వచ్చిన పాక్​ జట్టు పై​ టీమిండియా క్రికెటర్‌ ధావన్ ఫన్నీ ట్వీట్ చేశారు. ముగింపు లేని లవ్​ స్టోరీ అంటూ..పాక్​ జట్టు పై​ టీమిండియా క్రికెటర్‌ ధావన్ సెటైర్లు పేల్చారు. క్రికెట్ లో క్యాచులు మ్యాచ్లను డిసైడ్ చేస్తాయనేది వాస్తవం. అయితే పాకిస్తాన్ టీం ఎక్కువ మాత్రం ఇవేవీ పట్టనట్లు కనిపిస్తోంది. ఆసీస్ తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్ లోను పాక్ ప్లేయర్ల ఫీల్డింగ్ తీరు అలాగే ఉంది.

Shikhar Dhawan Mocks Pakistan Fielding Mix-Up In Australia World Cup Warm-Up Fixture
Shikhar Dhawan Mocks Pakistan Fielding Mix-Up In Australia World Cup Warm-Up Fixture

దీంతో వారి ఫీల్డింగ్ పై ‘పాకిస్తాన్-ఫీల్డింగ్… నెవెర్ ఎండింగ్ లవ్ స్టోరీ’ అంటూ శికర్ ధావన్ ఫన్నీ సెటైర్లు వేశారు. మిస్ ఫీల్డింగ్ వీడియోను షేర్ చేయగా… నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో పాకిస్తాన్ కు మరోసారి నిరాశే ఎదురైంది. నిన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఆస్ట్రేలియా భారీ విజయాన్ని అందుకుంది. ఈ వరల్డ్ కప్ వార్మప్ మ్యాచ్ లో పాకిస్తాన్ పై 14 రన్స్ తేడాతో గెలిచింది ఆస్ట్రేలియా జట్టు.

Read more RELATED
Recommended to you

Latest news