మహారాష్ట్రలోకి జోడోయాత్ర..రాహుల్ గాంధీ గెటప్ అదరహో

తెలంగాణలో భారత్ జోడో యాత్ర నిన్నటితో ముగిసింది. ఈ నేపథ్యంలోనే నిన్న అర్థరాత్రి మహారాష్ట్రలోకి ప్రవేశించింది రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర. అక్టోబర్ 23న మక్తల్ కృష్ణా నది వంతెన వద్ద తెలంగాణలోకి ప్రవేశించిన యాత్ర.. 16 రోజుల్లో 4 రోజుల విరామంతో 12 రోజులపాటు 375 కి.మీ కొనసాగింది భారత్ జోడో యాత్ర.

ఇక నిన్న అర్థరాత్రి మహారాష్ట్రలోకి ప్రవేశించింది రాహుల్‌ గాంధీ భారత్ జోడో యాత్ర. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీకి చాలా గ్రాండ్‌ గా స్వాగతం పలికారు మహారాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ నేతలు.

నాందేడ్ మహారాష్ట్రలోని గురుద్వారా యాద్‌గారి బాబా జోరావర్ సింగ్ జీ, ఫతే సింగ్ జీ వద్ద గురునాంక్ గురుపురబ్ అర్దాస్‌ను అందించారు రాహుల్ గాంధీ. అనంతరం వారి సింగ్‌ ల గెటప్‌ లో కనిపించారు రాహుల్‌ గాంధీ.