మాపై 170 కేసులు పెట్టారు: సీఎం కేజ్రీవాల్

-

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ఆప్ ఎమ్మెల్యే అమంతుల్లా ఖాన్ ఇంటిలో చేస్తున్న ఐటి దాడుల గురించి బహిరంగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు మరియు సీనియర్ లీడర్ లపై కేసులు పెడుతూ వస్తున్నారని వాపోయారు. ఇప్పటి వరకు చూస్తే 170 కి పైగానే కేసులను మాపై పెట్టిన పరిస్థితులు ఉన్నాయి, కానీ న్యాయం మా వైపు ఉంది కాబట్టి అందులో 140 కేసుల్లో తీర్పులు మాకు అనుకూలంగా వచ్చాయంటూ కేజ్రీవాల్ చెప్పడం జరిగింది. ఎటువంటి ఆధారాలు లేకుండా ఏదో వీరిపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చేసినవే కానీ… మేము దోషులం కాదు అంటూ కోర్టులే తీర్పులను ఇచ్చాయి అంటూ కేజ్రీవాల్. ఇక లిక్కర్ స్కాం లో మనీష్ సిసోడియా కేసులో కూడా వాళ్ళ దగ్గర సరైన ఆధారాలు లేవని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇది అంతా ఫేక్ కేసు అంటూ కేంద్రాన్ని ఇండైరెక్ట్ గా ఉద్దేశించి మాట్లాడారు.

ఇక రెండు రోజుల క్రితం అయిదు రాష్ర్ట్రాలలో నోటిఫికేషన్ విడుదల కాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ మరియు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో ఆప్ పోటీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news