సిద్ధరామయ్యే పూర్తికాలం సీఎం : మంత్రి ఎంబీ పాటిల్‌

-

ఎట్టకేలకు కర్ణాటక ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై వారం కూడా కాకముందే అధికార పంపిణీపై చర్చ మొదలైంది. ‘ఐదేళ్ల వరకు కూడా సిద్ధరామయ్యే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు’ అంటూ ఎం.బి.పాటిల్‌ చేసిన వ్యాఖ్యపై పార్టీలో మళ్లీ రచ్చ మొదలైంది.

దీనిపై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ స్పందించారు. ‘అధికార పంపిణీపై ఎవరేమన్నా నాకు అవసరం లేదు. ఆ విషయంపై నేనేమీ మాట్లాడను. అధికార పంపిణీ, ఇతర విషయాలపై నిర్ణయించేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, జాతీయ నేతలున్నారు. మేము ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర అభివృద్ధికే ప్రాధాన్యమిస్తాం’ అని వివరించారు.

ఇదే అంశంపై ఎంపీ, డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్‌ కూడా స్పందించారు. ‘అది ఇప్పుడు చర్చించే అంశం కాదు. అది ఏఐసీసీ స్థాయిలో చర్చించే అంశం’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుండగా, మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు గురువారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే దిల్లీకి వెళ్లనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news