ఎడిట్ నోట్: కేసీఆర్ ‘సిట్టింగ్’ ప్లాన్.!

-

2014, 2018..ఇక ఉన్నది 2024 ఎన్నికలు..ఆ రెండు ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చారు..ఇక 2024లో కూడా గెలిచి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలనేది కే‌సి‌ఆర్ ప్లాన్. ఆ దిశగానే ఆయన రాజకీయం నడిపిస్తున్నారు. మళ్ళీ ప్రత్యర్ధులకు ఛాన్స్ ఇవ్వకుండా మూడోసారి కూడా గెలిచి సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే తెలంగాణలో మళ్ళీ కే‌సి‌ఆర్ గెలిచే అవకాశాలు ఉన్నాయా? బి‌ఆర్‌ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తుందా? అసలు కే‌సి‌ఆర్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళుతున్నారు. అనే అంశాలని ఒకసారి పరిశీలిస్తే..ఈ సారి ఎన్నికల్లో గెలుపు దిశగా కే‌సి‌ఆర్ వ్యూహాలు ఉన్నాయి.

ఇప్పటికే ప్రతిపక్షాలైన బి‌జే‌పి, కాంగ్రెస్ రేసులోకి వస్తున్నాయి. కానీ ఆ రెండు పార్టీలు అనుకున్న మేర బలంగా లేవు. పైగా ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. దాని వల్ల బి‌ఆర్‌ఎస్ పార్టీకి లాభం జరిగే ఛాన్స్ ఉంది. ఈ అంశం పక్కన పెడితే..సొంత పార్టీలోనే కొన్ని మార్పులతో కే‌సి‌ఆర్ ఊహించని స్కెచ్ తో వస్తున్నారు. ఆయన మొదట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు అని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. మరి నిజంగానే అందరు ఎమ్మెల్యేలకు సీట్లు ఇస్తారా? అంటే అందరికీ సీట్లు ఇవ్వడం అనేది కష్టమే..కొందరు ఎమ్మెల్యేలకు సీట్లు డౌటే అని చెప్పవచ్చు. ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే కనిపిస్తుంది. అలాంటప్పుడు వారికి సీట్లు ఇస్తే గెలవడం కష్టమవుతుంది..మళ్ళీ బి‌ఆర్‌ఎస్ పార్టీ గెలవడం జరిగే పని కాదు. అలా అని  ముందు నుంచే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు లేవంటే వారు పార్టీలు మారిపోయే అవకాశాలు ఉంటాయి.

అందుకే ఎన్నికల సమయం వరకు చూసి..కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలని సైడ్ చేసే ప్లాన్ లో కే‌సి‌ఆర్ ఉన్నారు. ఇటీవల అంతర్గత సమావేశాల్లో ప్రజల్లో గ్రాఫ్‌ సరిగా లేని ఎమ్మెల్యేలకు టికెట్‌ ఇచ్చేది లేదని కే‌సి‌ఆర్ చెప్పినట్లు తెలిసింది. జనంలో మంచి అభిప్రాయం లేనివారికి టికెట్‌ ఇచ్చి సీట్లు కోల్పోయే స్థితిలో తాము లేమని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పలుమార్లు సర్వేలు చేయించిన కేసీఆర్‌.. ఎప్పటికప్పుడు చోటుచేసుకుంటున్న మార్పులపైనా రహస్య సర్వేలు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వేలో పనితీరు బాగున్న వారికే సీట్లు ఇచ్చి..మళ్ళీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. చూడాలి మరి కే‌సి‌ఆర్ వ్యూహాలు ఎలా మారతాయో.

Read more RELATED
Recommended to you

Latest news