స‌ర్ య‌స్‌ స‌ర్.. అంటూ ట్విట్ట‌ర్ యూస‌ర్‌ను ట్రోల్ చేసిన ధోనీ..

 

ఎం.ఎస్ ధోనీ అంటే క్రికెట్ ప్ర‌పంచంలో ఒక చ‌రిత్ర అని చెప్పాలి. కూల్ కెప్టెన్‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌ల‌క‌డంతో రెస్ట్ తీసుకుంటున్నాడు. ధోనీ సోష‌ల్ మీడియాలో ఒక‌ప్పుడు చురుగ్గా ఉండేవాడు. అప్పుడు అభిమానుల‌న ప్ర‌శ్నల‌కు కూడా రిప్లై ఇచ్చేవాడు.

2012జులైలో ఇండియా టీమ్ శ్రీలంకతో మ్యాచ్ కోసం ప్రిపేర్ అవుతున్న టైమ్‌లో ఓ అరుదైన ఘ‌ట‌న చోటుచేసుకుంది. ధోనీ జ‌డేజాను త‌న వ‌రుస ట్వీట్ల‌తో ట్రోల్ చేశాడు. ఇది గ‌మ‌నించిన ఓ ట్విట్ట‌ర్ యూస‌ర్ ధోనీ ట్వీట్ల‌కు రిప్లై ఇస్తూ.. స‌ర్ మీరు బ్యాటింగ్‌పై దృష్టి పెట్టండి.. ట్విట్ట‌ర్ మీద కాదు అంటూ చెప్పాడు.

అయితే దీనికి ధోనీ రిప్లై ఇస్తూ sir yes sir, any tips sir అంటూ స్పందించాడు. దీంతో ఈ ట్వీట్ కాస్తా విప‌రీతంగా ట్రెండ్ అయింది. అప్ప‌ట్లోనే దీనికి 2,500ట్వీట్లు వ‌చ్చాయి. దీంతో అప్ప‌టి నుంచి జ‌డేజాను స‌ర్ జ‌డేజా అంటూ పిల‌వ‌డం మొద‌లు పెట్టారు. ఇప్పుడు ధోనీకి ట్విట్ట‌ర్ లో 8.2 మిలియన్ల మంది ఫాలోవ‌ర్స్ ట్విట్టర్లో ఉన్నారు. ధోనీ ఇప్పుడు ఐపీఎల్ లో ఆడుతున్నాడు. 2021 త‌ర్వాత ఐపీఎల్‌కు కూడా రిటైర్ మెంట్ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.