స్వల్పంగా తగ్గిన పసిడి, వెండి ధరలు…!

-

కరోనా వ్యాక్సిన్ క్లినికల్ పరీక్షల నేపథ్యంలో మొదటగా దేశీ మార్కెట్లు భారీ లాభల్లో రోజును ప్రారంభించాయి. నిజానికి ఇదే అంచనాలతో మంగళవారం నాడు అమెరికా మార్కెట్లు కూడా లాభాలతో ముందుకు కదలడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు పాల్పడ్డారు. ఇక చివర్లో కొనుగోళ్లు ఆగిపోవడంతో పాటు అమ్మకాలు ఊపు అందుకోవడంతో భారీ లాభాల్లో మొదలైన స్టాక్ మార్కెట్ ఒకానొక దశలో నష్టాల్లో కూడా ప్రవేశించి చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సెన్సెక్స్ 19 పాయింట్లు ఎగిసి 36052 వద్ద నిలవగా, నిఫ్టీ కూడా కేవలం 11 పాయింట్లు లాభపడి 10618 వద్ద స్థిరపడింది.

Gold-2

ఇక నేడు ఇంట్రాడే నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయానికి చూస్తే… విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, టీసిఎస్, టెక్ మహీంద్రా లాంటి కంపెనీలు అత్యధిక శాతం లాభపడిన షేర్లలో ముందుగా ఉన్నాయి. ఇక ఇందులో విప్రో షేర్లు ఏకంగా 16 శాతం పైగా లాభపడ్డాయి. మరోవైపు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్, జియో, జీ ఎంటర్టైన్మెంట్, భారతి ఇన్ఫ్రాటెల్ సంస్థలు నష్టాల బాట పట్టాయి. ఇందులో భారతీ ఎయిర్టెల్ అత్యధికంగా 4.37 శాతం నష్టపోయింది. దీనితో పాటు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.70 తగ్గి రూ.51,170 కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50 తగ్గి రూ.46, 910 కు చేరింది. వీటితో పాటు కేజీ వెండి ధర కూడా రూ. 90 రూపాయలు క్షీణించి రూ. 52,120 కు చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version