రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్, సెక్యూలర్ మాయం.. కాంగ్రెస్ ఆగ్రహం..!

-

పార్లమెంట్ కొత్త భవనంలోకి ఎంపీలు అడుగుపెట్టిన సమయంలో వారికి భారత రాజ్యాంగ పత్రులను అందించారు. అందులోని పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు లేకపోవడం వివాదస్పదం అయింది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ తో పాటు ఇతర పార్టీల నేతలు తీవ్రంగా మండిపడ్డారు. వాటిని తొలగించడం రాజ్యాంగంపై దాడేనని పేర్కొన్నారు. ఎంపీలకు ఇచ్చిన రాజ్యాంగ కొత్త కాపీలలోని పీఠికలో సోషలిస్ట్, సెక్యులర్ పదాలు కనిపించడం లేదని కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు.

పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియాగాంధీ పేర్కొన్నారు. లోక్ సభ సమావేశాలకు హాజరయ్యే ముందు పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో ముచ్చటించారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. 1976లో చేసిన సవరణతో వాటిని రాజ్యాంగ పీఠికలో పొందుపరిచిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఇచ్చిన కాపీలలో ఇవి లేకపోవడం వల్ల పలు అనుమానాలకు తావిస్తోంది. చాలా తెలివిగా ఈ పని చేసినట్టు కనిపిస్తోంది. ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news