అప్పుడు సోనుని అడిగాడు, ఇప్పుడు సహాయం చేసేసాడు…!

-

కరోనా కష్ట కాలంలో ప్రజలకు ప్రభుత్వాలు ఎంత వరకు సహాయం చేసాయి అనేది పక్కన పెడితే నటుడు సోను సూద్ మాత్రం ఆసక్తికరంగా మారిపోయారు. ప్రజలకు ఆయన సహాయం చేస్తున్న విధానం చాలా బాగా ఆకట్టుకుంది. తాజాగా ట్విట్టర్ లో సోను సూద్ మరొకరికి సాయం చేసాడు. ఆగస్ట్ 22 న గౌరవ్ విజయ్ ట్విట్టర్ లో సోను సూద్ కి తన కష్టం చెప్పుకున్నాడు.

సోనుసూద్ సార్ కాలేయ వైఫల్యం కారణంగా నా తండ్రిని కోల్పోయాను. నా తండ్రి చికిత్స కోసం మేము మా కుటుంబ పొదుపులన్నింటినీ ఖర్చు చేశాము. ఇప్పుడు ఆర్థిక సమస్యల కారణంగా నేను కాలేజీలో ప్రవేశం పొందలేకపోయాను. దయచేసి సార్ నాకు ప్రవేశం పొందటానికి సహాయం చెయ్యండి. నేను పార్టిమెజో చేస్తాను” అని ట్వీట్ చేసాడు. దీనికి సోను స్పందిస్తూ అడ్మిషన్ డన్ అని రిప్లై ఇచ్చాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version