మంత్రి పొంగులేటి మీద తిరగబడ్డ ఖమ్మం ప్రజలు..!

-

మంత్రి పొంగులేటి మీద తిరగబడ్డారు ఖమ్మం ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసం పై జనం తిరుగుబాటు చేశారు. అర్హులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు ఇచ్చారని ఆరోపణలు చేశారు.  నచ్చచెప్పినా వినిపించుకోకుండా మంత్రితో వాగ్వాదానికి దిగారు గిరిజన మహిళలు. సహనం కోల్పోయి గిరిజనులు, స్థానిక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొంగులేటి.

మొన్న ఆచార్లగూడెం, నేడు దుబ్బ తండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో కాంగ్రెస్ నేతల మోసం పై మంత్రిని నిలదీశారు గిరిజనులు.  భోగి పండుగ రోజున బోగస్ పంపకాలు చేస్తున్నారని.. మంత్రి పొంగులేటికి ఎదురు తిరిగారు. డబుల్ బెడ్ రూమ్ గిరిజన లబ్ధిదారులు గతంలో అర్హులుగా గుర్తించిన లిస్టును తారుమారు చేసారు స్థానిక కాంగ్రెస్ నాయకులు.  మంత్రిని చుట్టుముట్టి కదలకుండా నిలదీసి ప్రశ్నించారు లంబాడ మహిళలు. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లను ఇందిరమ్మ ఇల్లుగా మార్చి అర్హులకు కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించారని నిరసన చేపట్టారు.  మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి నిరసన సెగ తాకడంతో ప్రారంభం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version