త్వరలోనే గంగూలీ బయోపిక్.. దాదా ట్వీట్

ఇండియా మాజీ కెప్టెన్‌, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అభిమానులకు శుభవార్త అందింది. త్వరలోనే గంగూలీ జీవిత కథ ఆధారంగా దాదా బయోపిక్‌ రానుంది. ఈ విషయాన్ని స్వయంగా దాదానే తన ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న వారికి నిజంగా ఇది శుభవార్త అనే చెప్పాలి.

ఇన్ని రోజులు బుల్లి తెర, సోషల్‌ మీడియా లలో అతడి ఆటను, నాయకత్వాన్ని, క్రికెట్‌ పాలకునిగా చూసిన.. మనకు ఇప్పుడు వెండి తెరపై చూసే సౌలభ్యం దొరికింది. గంగూలీ కొద్దిసేపటి క్రిందే ఓ ట్వీట్‌ చేస్తూ.. ఈ విషయాన్ని ప్రకటించారు. ”క్రికెట్‌ నా జీవితంగా మారింది. అది నా ఆత్మ విశ్వాశాన్ని పెంచడమే కాకుండా ఏ సందర్భంలోనూ తలవంచకుండా ముందుకు సాగడాన్ని నేర్పింది. ఈ ప్రయాణం ఆస్వాదించదగినది. లవ్‌ ఫిల్మ్స్‌ చిత్ర నిర్మాణ సంస్థ నా జీవితాన్ని తెరకెక్కిస్తోంది. ఈ విషయం నాకు ఆనందాన్ని కలిగించింది” అంటూ ట్వీట్‌ చేశారు గంగూలీ.