తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అనూహ్య మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్ కేంద్రంగా ఎన్నో రకాల ట్విస్టులు జరుగుతున్నాయి. ఇక మొదటి నుంచి కాంగ్రెస్ క్యాండిడేట్‌గా ఉంటున్న కౌశిక్‌రెడ్డి ఎన్నో ఆశలతో టీఆర్ఎస్ లో చేరారు. ఇక ఆయన ఆశించిన మేరకు టీఆర్ఎస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం మార్పు చెందట్లేదని తెలుస్తోంది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున అభ్యర్థి అవుతాడనుకునే లోపే టీఆర్ఎస్ లో చేరారు. ఇక టీఆర్ఎస్లో కూడా ఈయనకే టికెట్ కన్ఫర్మ్ అని జోరుగా ప్రచారం సాగింది. ఆయనకూడా అందరికీ ఇలాగే చెప్పుకున్నారు.
కానీ ఇక్కడే ఆయనకు షాక్ తగిలిందతి. కౌశిక్‌కు ఎమ్మెల్సీ పదవితో సరిపెట్టారు కేసీఆర్. కానీ ఇక్కడ కూడా కౌశిక్ ఆశలు అడియాశలు అయ్యేలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయనకు ఎమ్మెల్సీ కన్ఫర్మ్ చేసేందుకు గవర్నర్ తమిళ సై అంత ఆసక్తిగా లేనట్టు తెలుస్తోంది. ఇక టికెట్ దక్కకపోయినా కూడా చివరకు ఎమ్మెల్సీగా అయినా ఛాన్స్ వస్తుందని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న కౌశిక్ కు గవర్నర్ నిర్ణయం షాక్ కలిగిస్తోంది.
అయితే కౌశిక్ కు సేవారంగం కోటాలో ఎమ్మెల్సీగా కేసీఆర్ కేబినెట్ ఆమోదు ముద్ర వేసింది. ఇక దీంతో అందరూ కూడా యనకు ఎమ్మెల్సీ వచ్చేసినట్టు ఫీల్ అయిపోయారు. కొందరు సీనియర్లు అయితే దీనిపై తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేశార. కాగా ఇప్పుడు ఈ ఫైల్ మీద ఆమోద ముద్ర వేసేందుకు గవర్నర్ తమిళి సై నో చెబుతున్నారు. ఎందుకంటే కౌశిక్ రెడ్డి కి అసలు సేవారంగంతో సంబంధం లేదని, అలాంటప్పుడు ఆయన్ను ఆ కోటాలో ఎలా సిఫార్సు చేశారని అడుగుతున్నారు. అయితే దీనిపై పూర్తిగా స్టడీ చేసిన తర్వాతే ఆమోదం తెలుపుతామంటూ చెబుతున్నారు. మరి ఆమె ఏ నిర్ణయం తీసుకుంటారో.