చెత్తకు సౌండ్తో రివేంజ్.. ఉత్తర కొరియా సరిహద్దుల్లో లౌడ్‌స్పీకర్ల మోత!

-

ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. తమ భూభాగంలో కరపత్రాలు వెదజల్లినందుకు ప్రతిగా ఇటీవల ఉత్తర కొరియా వెయ్యికిపైగా చెత్త బెలూన్లకు దక్షిణ కొరియాలోకి పంపిన విషయం తెలిసిందే. దీన్ని ఖండించిన సియోల్ ప్రతీకారం తీర్చుకుంది. ఉత్తర కొరియా సరిహద్దుల్లో లౌడ్‌ స్పీకర్లను ఏర్పాటు చేసి ఆ దేశానికి వ్యతిరేకంగా ప్రసారాలు ప్రారంభించింది. ఉత్తర కొరియన్లకు విదేశీ రేడియో, టీవీ ప్రసారాలు అందవు కాబట్టి ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు సమాచారం. దక్షిణ కొరియా జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించింది.

ఈ వ్యవహారంపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ శక్తిమంతమైన సోదరి కిమ్‌ యో జోంగ్‌ తీవ్రంగా స్పందిస్తూ.. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ఈ చర్యలకు తక్షణమే అడ్డుకట్టవేయకపోతే ఇదివరకు చూడని విధంగా స్పందిస్తామని వార్నింగ్ ఇచ్చారు. 2015లోనూ దక్షిణ కొరియా ఇలాగే లౌడ్ స్పీకర్లతో వ్యతిరేక ప్రసారాలు చేయగా కిమ్‌ సర్కారు ఫిరంగి గుండ్లు పేల్చింది.

Read more RELATED
Recommended to you

Latest news