కోల్ కతా ఘటనతో కేరళ అలర్ట్.. వైద్య కళాశాలల్లో స్పేస్ ఆడిట్ కు ఆదేశం

-

కోల్కతా జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో వైద్యుల భద్రతపై ఇప్పుడు ఆందోళనలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యుల భద్రతకు చర్యలు చేపడుతున్నాయి. కోల్కతా ఘటన నేపథ్యంలో కేరళ రాష్ట్ర ప్రభుత్వం వైద్యుల భద్రతకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో, వైద్యకళాశాలల్లో వైద్యుల భద్రతను నిర్ధరించేందుకు స్పేస్‌ ఆడిట్‌ నిర్వహించాలని మెడికల్ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ను ఆదేశించింది.

దీనిద్వారా మెడికల్‌ కాలేజీల నిర్వహణ ఏ మేరకు ఉందో తెలుస్తుందిని ప్రభుత్వం పేర్కొంది. మాక్‌డ్రిల్స్‌ నిర్వహణ, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, వాకీటాకీల వినియోగం, రాత్రివేళ ఆస్పత్రిలో అనుమతి లేకుండా ఉండేవారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రాత్రిపూట డ్యూటీ ముగించుకొని వెళ్లే మహిళా ఉద్యోగులకు భద్రత కల్పించాలని , వీధి కుక్కల దాడుల నుంచి సిబ్బంది , విజిటర్స్‌ను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం సాయంతో తగిన ప్రణాళికలు అమలు చేయాలని తెలిపింది. అన్ని వైద్య కళాశాలలు కోడ్‌ గ్రే  ప్రొటోకాల్‌ను అమలు చేయాలని మెడికల్ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌కు ఆదేశాలిస్తూ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news