రైతుల ఆందోళనపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం..?

-

న్యూఢిల్లీ: రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. నూతన వ్యవసాయంపై చట్టాలపై కేంద్రంతో రైతు సంఘాలు జరిపిన చర్చలు ఐదోసారి ఎలాంటి ఫలితం లేకుండా ముగిశాయి. ఇప్పటికీ ఆందోళన ప్రారంభమై 11వ రోజుకి చేరింది. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, టిక్రీలో తిష్ట వేసిన రైతులు ఈ రోజు వరకు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. హరియాణా, పంజాబ్ వైపు వెళ్లే రహదారుల్ని దిగ్బంధించారు. దీంతో గత పదిరోజులుగా ట్రాఫిక్ సమస్య నెలకొనే ఉంది.

Delhi_Chalo

రైతులు ఆందోళనను విరమించుకోకపోవడంతో కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రైతుల ఆందోళనను పరిగణనలోకి తీసుకుని కొత్త చట్టాల్లో కొన్ని సవరణలు చేసేందుకు సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. రైతుల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పటివరకూ సుముఖత చూపడం లేదని రైతు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. తక్షణమే రైతుల సమస్యలను పరిష్కరించాలని, అప్పటివరకూ ఆందోళన కొనసాగుతూనే ఉంటుందని రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.

అయితే పార్లమెంట్ సమావేశంలో ఎలాంటి సవరణలు చేయబోతున్నారు. చట్టంలోని ఏ సెక్షన్ లో మార్పులు చేస్తున్నారనే దానిపై సందిగ్ధత నెలకొంది. కేంద్రం రైతుల సమస్యలపై తదుపరి చర్చలు జరిపేందుకు డిసెంబరు 9వ తేదీన వాయిదా వేశారు. మరోవైపు వివిధ వర్గాల నుంచి రైతులకు మద్దతు పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాల్లో అన్నదాతలకు సంఘీభావంగా కారు ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పారటీ అధికార ప్రతినిధి హర్ జోత్ సింగ్ బెయిన్స్ ట్విట్టర్ లో వెల్లడించారు. కాలిఫోర్నియాలో నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన వీడియో, ఫోటోలను ఫోస్ట్ చేశారు.

మహారాష్ట్రకు చెరకు రైతులు సంఘీభావం తెలపడంతో పాటు రాష్ట్రంలో రైతుల సమస్యలన్నీ పరిష్కరించాలని మరోవైపు శుక్రవారం ఆందోళనకు దిగారు. ఔరంగాబాద్ లో జరిగిన ఈ ఘటనలో 150 మంది రైతులపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఒకే చోట చేరి నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు. మరోవైపు ఒడిశాలోనూ కేంద్రీకృత పంట సేకరణ విధానానికి వ్యతిరేకంగా రైతులు నిరసన తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version