కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాని (సీఐఎస్‌ఎఫ్)కి చెందిన ఓ అధికారిని స్సైస్ జెట్ మహిళా ఉద్యోగి అనురాధా రాణి చెంపదెబ్బ కొట్టిన వీడియో వైరల్ కావడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో ఆమెను గురువారం రోజున పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియోలో రాణితో సీఐఎస్‌ఎఫ్ అధికారి మాట్లాడుతున్నట్లు కనిపించింది. ఇంతలో ఆమె ఒక్కసారిగా రెండడుగులు ముందుకేసి ఆయన చెంప చెళ్లుమనిపించింది.
ఆ వెంటనే ఓ మహిళా కానిస్టేబుల్ రాణిని అక్కడ నుంచి పక్కకు తీసుకువెళ్లినట్లు వీడియోలో కనిపించింది. ఈ క్రమంలో రాణిపై అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విమానయాన సంస్థ ప్రతినిధులు కూడా స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఆ మహిళ కూడా సీఐఎస్‌ఎఫ్ అధికారిపై ఫిర్యాదు చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా నేరుగా ఎయిర్పోర్టులోకి ప్రవేశించడానికి ప్రయత్నించడంతో సదరు అధికారి ఆమెను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె అధికారిపై చేయి చేసుకున్నట్లు సమాచారం.
If @flyspicejet doesn’t issue an official apology in the next 24 hours to the officer of CISF who was slapped by the airline employee.
There will be a massive backlash.
SpiceJet your time starts now.
SACK THE EMPLOYEE AND APOLOGIZE. pic.twitter.com/bWzBRCL07T
— Akshit Singh 🇮🇳 (@IndianSinghh) July 11, 2024