శ్రీలంక జట్టు కు బిగ్ షాక్ తగిలింది. వరల్డ్ కప్ లో భారత్ చేతిలో 302 రన్స్ తేడాతో ఘోరంగా ఓడిన శ్రీలంక జట్టుపై ఆ దేశ క్రీడా మంత్రిత్వశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమిస్తున్నట్లు వెల్లడించింది. ‘బోర్డులోని సభ్యులకు పదవిలో ఉండే హక్కులేదు.
అవినీతి పెరిగింది. అందుకే బోర్డును తొలగించాం’ అని క్రీడామంత్రి రనసింగే తెలిపారు. ఇది ఇలా ఉండగా.. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా… ఇవాళ మరో రసవత్తర పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్లో భాగంగా బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జెట్లీ మైదానంలో జరుగుతోంది. అయితే.. బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుందా…లేదా… అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఢిల్లీలో దుమ్ము విపరీతంగా ఉంది. దీంతో ఇవాల బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరుగుతుందో లేదో చూడాలి.