వరల్డ్ కప్ లో ఇవాళ మరో రసవత్తర పోరు జరగనుంది. ముంబై వాంకడే స్టేడియంలో ఇండియా, శ్రీలంక జట్లు తలపడనుండగా…. ఈ పోరు లంక జట్టుకు కీలకంగా మారింది. ఈ మ్యాచ్ లో ఓడితే ఆ జట్టు ఈ మెగా టొర్ని నుంచి నిష్క్రమించడం దాదాపు కాయం కానుంది.
2011లో అద్భుత ప్రదర్శన చేసిన ఆ జట్టు ఫైనల్ కు చేరగా…ఈసారి ఆడిన 6 మ్యాచుల్లో రెండు విజయాలే నమోదు చేసింది. ఇక వరుస విజయాలతో జోరు మీదున్న భారత్ తో తలపడటం లంకకు సవాల్ గా మారింది.
ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్ కు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పై వేటు వేయాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. అతని స్థానంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను జట్టులోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మహమ్మద్ సిరాజ్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ కు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా స్థానంలో సూర్య కుమార్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.