అయోధ్య రాముడి నుదుటిపై సూర్యకిరణాలు పడేలా ఏర్పాట్లు

-

ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరం పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం గర్భగుడి కోసం రాతి స్తంభాలు చెక్కుతున్నారు. నవంబర్ నాటికి ఆలయం గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. అయోధ్య రామాలయానికి శిల్పులు అదనపు హంగులు జోడిస్తున్నారు. ఆలయ గర్భగుడిలోని రాముడి విగ్రహాన్ని సూర్యకిరణాలు తాకేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శాస్త్రీయంగా ఈ ప్రక్రియ జరిగేలా చూస్తున్నారు. ఇందుకోసం రామాలయ ప్రాంగణంలో ప్రత్యేక నిర్మాణం చేపట్టనున్నారు. ఇది పూర్తైతే ఏటా శ్రీరామనవమి రోజున మధ్యాహ్నం 12 గంటలకు సూర్య కిరణాలు.. రాముడి విగ్రహం నుదిటిపై పడతాయి.

మరోవైపు అయోధ్యలోని శ్రీరామ మందిరం ప్రాంగణంలో.. ప్యాసెంజర్ ఫెసిలిటేషన్ సెంటర్​ను నిర్మించనున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నాయి. ఈ భవనం పైభాగంలో ప్రత్యేక నిర్మాణాలు చేపట్టనున్నట్లు సమాచారం. రాముడి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా.. శాస్త్రవేత్తల పర్యవేక్షణలో నిర్మాణాలు చేయనున్నారు. ఓ పైప్​ను అమర్చి.. ఆధునిక లెన్సుల ద్వారా సూర్య కిరణాలను ప్రసరింపజేయనున్నారు. రామ్​లల్లా విగ్రహం నుదుటిపై సూర్యకిరణాలు పడేలా ఈ ఏర్పాట్లు చేయనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news