SSMB 28 : మహేష్ బాబు మాస్ లుక్ రిలీజ్

-

అతడు, ఖలేజా చిత్రాలతో టాలీవుడ్‌లో క్రేజీ కాంబినేషన్‌గా నిలిచారు నటుడు మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న మూడో చిత్రం #SSMB28 (వర్కింగ్‌ టైటిల్‌) ప్రకటన వెలువడటమే ఆలస్యం సినీ ప్రియుల్లో ఆసక్తి నెలకొంది. వీరి కాంబినేషన్ లో రానున్న పాన్ ఇండియా చిత్రం పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలే ఉన్నాయి.

అయితే…సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న #SSMB28 సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. కృష్ణ జయంతి సందర్భంగా సినిమాలోని మహేష్ బాబు లుక్ ను రిలీజ్ చేశారు. ‘ఈరోజు చాలా ప్రత్యేకం. ఇది నీకోసమే నాన్న’ అని ప్రిన్స్ ట్విట్ చేశారు. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news