IPL 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్… జట్ల వివరాలు ఇవే

ఐపీఎల్ 2021 సెకండ్ సీజన్ లో భాగంగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య 37 వ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించిన టాస్ ప్రక్రియ కాసేపటి క్రితమే ముగిసింది. ఇక ఇందులో టాస్ నెగ్గిన సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ మొదట బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపాడు.

దీంతో పంజాబ్ కింగ్స్ జట్టు మొదటగా బ్యాటింగ్ కు దిగింది. ఇక సెకండ్ సీజన్ లో రెండు జట్లూ.. ఒక్కో మ్యాచ్ ఓడిపోగా… ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని ప్రయత్నిస్తున్నాయి. కాగా జట్ల వివరాలు లోకి వెళితే…

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ, హర్‌ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, నాథన్ ఎల్లిస్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా (w), కేన్ విలియమ్సన్ (c), మనీష్ పాండే, కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్