ఐక్యరాజ్యసమితిలో ప్రధాని మోడీ ప్రసంగం..ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్ పై కీలక ప్రకటన !

ఐక్య రాజ్యసమితి లో మన దేశ ప్రధాని మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం సాధించి భారత్ 75 సంవత్సరాల లోకి అడుగు పెట్టిందని పేర్కొన్నారు. భారతదేశం లోని విభిన్నతే తమ ప్రజాస్వామ్యానికి బలం అని వెల్లడించారు ప్రధాని మోడీ. కరోనా మహమ్మారి ఇ కారణంగా ప్రపంచం తగిన సమయాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు.

ఈ శతాబ్దంలోనే ఇది అత్యంత కఠిన సమయమని ప్రధాని మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి సమయంలోనూ మూడు కోట్ల మందికి ఇల్లు కట్టించమని ప్రకటించారు. భారత్ లో జరిగే పరిశోధనలు ప్రపంచానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయని స్పష్టం చేశారు ప్రధాని మోడీ. భారత అభివృద్ధి తో ప్రపంచ వృత్తిలోనూ వేగం పెరిగిందన్నారు. భారతదేశంలో అనేక డిజిటల్ సంస్కరణలో చేపడుతున్నామని వెల్లడించారు.

భారతదేశంలో కొన్ని సంవత్సరాలుగా ప్రజాస్వామ్య పరంపర కొనసాగుతోంది స్పష్టంచేశారు ప్రధాని మోడీ. కరోనా సమయంలో భారతదేశం వ్యాక్సిన్ హబ్ గా నిలిచిందని… ఆరు లక్షల గ్రామాలను డ్రోన్ మ్యాపింగ్ చేశామన్నారు. ముక్కు ద్వారా ఇచ్చే టీకాను త్వరలోనే తీసుకొస్తామని కీలక ప్రకటన చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. కరోనా వ్యాక్సిన్ విషయంలో.. ప్రపంచ దేశాలు భారత్ వైపునకు చూస్తున్నాయని తెలిపారు.