బ్రేకింగ్ : రాజస్థాన్ రాయల్స్ పై 33 పరుగుల తేడాతో ఢిల్లీ ఘన విజయం

ఐపీఎల్ 2021 సెకండ్ సీజన్ లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్ మరియు డిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య 36 వ మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో… రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు భారీ విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై ఏకంగా 33 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

రాజస్థాన్ రాయల్స్ టాప్ ఆర్డర్ పూర్తిగా విఫలం కావడంతో.. ఢిల్లీ జట్టు అవలీలగా విజయం సాధించింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ 70 పరుగులు, మరియు మహిపాల్ 19 పరుగులు మినహా ఏ ఒక్క బ్యాట్స్మెన్ రాణించలేకపోయారు. ఓపెనర్లు లివింగ్స్టన్ ఒక పరుగు, యశస్వి జైస్వాల్ 5 పరుగులు, డేవిడ్ మిల్లర్ 7 పరుగులు, మరియు రియాన్ పరాగ్ రెండు పరుగులు చేసి ఘోరంగా విఫలం అయ్యారు. అటు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అన్రిచ్ నార్తే వరుసగా రెండు వికెట్లు తీసి… రాజస్థాన్ రాయల్స్ జట్టు ను తీవ్రంగా దెబ్బ తీశారు. దీంతో ఢిల్లీ జట్టు 33 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.