వీవీప్యాట్‌ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?.. ఈసీకి సుప్రీం ప్రశ్న

-

(ఈవీఎం) లో నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. దీంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తిపైనా ప్రశ్నించింది. ప్రజాబాహుళ్యంలో ఉన్న సమాచారానికి, ఈసీ చెబుతున్న వివరాలకు పొంతన కుదరడం లేదని పేర్కొంటూ ఈ అంతరాన్ని నివారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.

లెక్కింపు సమయంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలలో (ఈవీఎం) నమోదైన ఓట్లను… వీవీప్యాట్‌ స్లిప్పులతో సరిపోల్చి చూడాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం గురువారం రోజంతా విచారణ జరిపింది.  ‘వీవీప్యాట్‌ బాక్సులో నిక్షిప్తమైన స్లిప్పులు అన్నింటిని లెక్కించడానికి అధిక సమయం ఎందుకు పడుతుంది. యంత్రాల ద్వారా వేగంగా లెక్కించడం ఎందుకు సాధ్యం కాదు’ అని ధర్మాసనం ఆరా తీసింది. వీవీప్యాట్ల స్లిప్పులు పలుచటి కాగితంతో, అంటుకునేలా ఉంటాయి కనుక లెక్కించడానికి అనువుగా ఉండవని ఎన్నికల అధికారి వివరించారు.  వాదనలు ముగిసిన తర్వాత తీర్పును రిజర్వు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news