సుప్రీం కోర్టులో నేడు ‘మ‌ణిపూర్‌ మ‌హిళ‌ల అమానవీయ ఘటన’పై విచార‌ణ‌

-

జాతుల మధ్య వైరంతో మణిపుర్ రాష్ట్రం రావణకాష్టంలా మారింది. రోజురోజుకు అక్కడ ఘర్షణలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఇక ఇటీవల అక్కడ ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమకు జరిగిన అవమానంపై బాధితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇవాళ సుప్రీం కోర్టు విచారణ జరపనుంది.

సీజేఐ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ఇవాళ విచార‌ణ చేప‌ట్ట‌నుంది. ఈ విచార‌ణ‌తో పాటు మ‌ణిపూర్ హింసాకాండ‌పై కేంద్ర హోం శాఖ ఇటీవ‌ల స‌మ‌ర్పించిన నివేదిక‌ను కూడా సుప్రీంకోర్టు ప‌రిశీలించ‌నుంది. మణిపుర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని హోం మంత్రిత్వ శాఖ గత వారం సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news