వచ్చే ఎన్నికల్లో తెలంగాణ విజయం సాధిస్తాం – కిషన్‌ రెడ్డి

-

వచ్చే ఎన్నికల్లో తెలంగాణ విజయం సాధిస్తామని… ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు ప్రకటించారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బీజేపీ పార్టీలో తాజాగా మాజీ ఎమ్మెల్యేలు సంజీవ రావు, శ్రీదేవి చేరారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి సమక్షం లో బీజేపీ లో చేరారు ఇద్దరు మాజీ ఎమ్మెల్యే లు సంజీవ రావు, శ్రీదేవి.

ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి..మాట్లాడుతూ.. కాంగ్రెస్, brs, mim ఒకే తాను ముక్కలు అని ఫైర్‌ అయ్యారు. గతంలో పొత్తు పెట్టుకున్నాయి… కలిసి పని చేశాయని వివరించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ఇచ్చింది… స్వాగతాలు పలికి ఊరేగింపులు చేశారని ఫైర్‌ అయ్యారు. అవిశ్వాస తీర్మానం పై brs మద్దతు ఇచ్చింది… ఒకే వేదిక మీద నుంచి ప్రసంగించారు.. కాంగ్రెస్, brs అవినీతి, కుటుంబ, నియంత పార్టీ లు అని ఆగ్రహించారు. ప్రజలు కంటే కుటుంబమే ముఖ్యం అనే పార్టీ లు ఇవి అంటూ రెచ్చిపోయారు కిషన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news