బిల్కిస్‌ బానో కేసు దోషుల విడుదలపై నేడు ‘సుప్రీం’ తుదితీర్పు..

-

బిల్కిస్ బానో దోషుల విడుదల కేసులో సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును ఇవ్వనుంది. 2002 గుజరాత్‌ అల్లర సమయంలో బిల్కిస్‌ బానోపై సామూహిక లైంగిక దాడి చేయడమే గాక, ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని హత్య చేశారు. ఈ ఘటనలో జీవిత ఖైదు పడిన మొత్తం 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం 2022, ఆగస్టులో విడుదల చేసిన విషయం తెలిసిందే.

అయితే దీన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం ఈరోజు  తుది నిర్ణయం తీసుకోనుంది. గతేడాది అక్టోబర్ 12వ తేదీన ఈ కేసులో తీర్పును ధర్మాసనం రిజర్వ్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుపై వరుసగా 11 రోజుల పాటు కోర్టులో సాగిన విచారణలో కేంద్ర ప్రభుత్వంతోపాటు గుజరాత్ ప్రభుత్వాలు దోషులకు శిక్షను తగ్గించడానికి సంబంధించిన అసలు రికార్డులను అందించాయి.  దోషులకు క్షమాభిక్ష ప్రకటించడాన్ని గుజరాత్ సర్కార్‌ సమర్ధించుకోగా నిందితులకు ముందస్తుగా విడుదల చేయడంపై కూడా సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు సంధించింది.

Read more RELATED
Recommended to you

Latest news