విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీ.. పేరు ఖరారు చేసిన వైసీపీ అధిష్టానం..?

-

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా ప్లాన్ తో ముందుకెళ్తోంది.. కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువగా ఉన్నచోట్ల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.. బలమైన నేతలను రంగంలోకి దింపి.. ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపించాలని సిద్ధమవుతోంది.. అందులో భాగంగా కీలక స్థానాలకు ఉన్న చోట.. మాజీ ఎంపీలను బరిలోకి దింపుతుంది.. మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి.. బొత్స ఝాన్సీ ని విశాఖ ఎంపీ స్థానం నుంచి బరిలో దింపాలని ఆలోచన చేస్తోంది..

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రత్యర్థి పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. వచ్చే ఎన్నికల్లో ఉనికిని చాటుకుందామని ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం పార్టీకి సీఎం జగన్ చుక్కలు చూపిస్తున్నారు.. మార్పులు చేర్పుల్లో భాగంగా ఇప్పటికే పలు నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చిన జగన్మోహన్ రెడ్డి.. ఎంపీ నియోజకవర్గ స్థానాల ఇన్చార్జులను కూడా మారుస్తున్నారు.. విశాఖ ఎంపీ స్థానం నుంచి బొత్స ఝాన్సీ ని బరిలోకి దింపాలని పార్టీ అధిష్టానం యోచిస్తుందట..

ఉత్తరాంధ్రలో కీలక నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ తన సతీమణి బొత్స ఝాన్సీ కి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నాల్లో ఉన్నారని పార్టీలో చర్చ నడుస్తుంది.. ఆమెకు టికెట్ ఇస్తే ఆమె ప్రభావం ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాలపై ఉంటుందని.. కాపు సామాజిక ఓట్లు కూడా తమ పార్టీకే వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ నేతలు భావిస్తున్నారు.. ఆయా ప్రాంతాలలో కాపు సామాజిక వర్గ నేతలకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ ఆలోచిస్తున్నారని.. అందులో భాగంగానే బొత్స ఝాన్సీ ని బరిలోకి దింపబోతున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది.. రెండుసార్లు ఎంపీగా.. రెండు పర్యాయాలు జెడ్పి చైర్ పర్సన్ గా పనిచేసిన బొత్స ఝాన్సీ ఇప్పుడు జిల్లా రాజకీయాలు చూసుకుంటున్నారు.. ఆమెను పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి వైవి సుబ్బారెడ్డి సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.. దీంతో ఆమె పేరు దాదాపు ఖరారు అయిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. ఇదిలా ఉంటే టిడిపి జనసేన నేతలు మాత్రం ఆందోళన చెందుతున్నారు.. బొత్స ఝాన్సీ ఎంపీగా పోటీ చేస్తే తమ అడ్రస్లు గల్లంతవ్వడం ఖాయం అనే భావనలో టిడిపి నేతలు ఉన్నారని చర్చ నడుస్తుంది..

Read more RELATED
Recommended to you

Latest news