పాత విద్యుత్ బకాయిలు కొత్త యజమాని నుంచి వసూలు చేయొచ్చు : సుప్రీం కోర్టు

-

విద్యుత్ బకాయిలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైనా ఒక ప్రాంగణం నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలను దాన్ని కొత్తగా కొనుగోలు చేసిన వారి నుంచి వసూలు చేసుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కేరళకు చెందిన ఓ కేసులో శుక్రవారం రోజున ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతోకూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది.

పాత యజమానులు బిల్లులు కట్టలేదన్న కారణంతో తమ నివాస ప్రాంగణాలకు విద్యుత్తు నిలిపేశారని పేర్కొంటూ 19 మంది దాఖలుచేసిన అప్పీళ్లలో సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ‘‘2003 విద్యుత్తు చట్టంలోని సెక్షన్‌ 43 ప్రకారం విద్యుత్తు సరఫరా చేయడం తప్పనిసరి కాదు. అది విద్యుత్తు పంపిణీ సంస్థలు నిర్దేశించిన ఛార్జీలు, నియమనిబంధనలకు లోబడి చేసుకొనే దరఖాస్తుకు అనుగుణంగా ఉంటుంది. 1948 నాటి చట్టంలోని సెక్షన్‌ 49 ప్రకారం విద్యుత్తు సరఫరాచేయాలంటే పాత యజమాని బకాయిలను కొత్త యజమాని చెల్లించడం తప్పనిసరి. పాత బకాయిలను కొత్త యజమాని నుంచి వసూలుచేసుకోవడానికి ఎలెక్ట్రిసిటీ సప్లైకోడ్‌ వీలు కల్పిస్తోంది.’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version