సిద్దరామయ్య ప్రమాణ స్వీకారానికి రేవంత్‌ రెడ్డి

-

సిద్దరామయ్య ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్‌ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కూడా హాజరుకానున్నారు. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీగా డీకే శివకుమార్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం బెంగళూరు కంటిరవ మైదానంలో భారీ ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుండగా…10మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, ఈ కార్యక్రమానికి మల్లికార్జున్ కర్గే, సోనియా, రాహుల్ తో పాటు ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా హాజరుకానున్నట్లు సమాచారం. సిద్దరామయ్య ప్రమాణ స్వీకారానికి ఏపి, తెలంగాణ నేతలు హాజరుకానున్నారు. ఇందులో భాగంగానే, కాసేపట్లో బెంగుళూరు కంఠీరవ స్టేడియం కు TPCC చీఫ్ రేవంత్ రెడ్డి చేరుకోనున్నారు. పొన్నాల లక్ష్మయ్య..మధు యాష్కీ..ఏపిసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు..వర్కింగ్ ప్రెసిడెంట్స్ మస్తాన్ వలీ పద్మశ్రీ ఇప్పటి కే బెంగుళూరు చేరుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version