బిల్కిస్ బానో కేసుపై సుప్రీం విచారణ.. రికార్డులన్నీ సమర్పించాలని గుజరాత్ ప్రభుత్వానికి ఆదేశాలు

-

బిల్కిస్ బానో అత్యాచార కేసులో దోషులను జైలు నుంచి విడుదల చేయడం పట్ల గుజరాత్ ప్రభుత్వంపై దేశంలోని రాజకీయ పార్టీలన్నీ విరుచుకుపడ్డాయి. రాజకీయాలకతీతంగా ఈ అంశంపై స్పందించాయి. దేశవ్యాప్తంగా దుమారం రేపిన ఈ కేసులో నిందితులకు రెమిషన్ మంజూరు చేసి విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా, మరొక వ్యక్తి సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

Supreme Court

ఇవాళ ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు.. బిల్కిస్ బానో కేసు విచారణకు సంబంధించిన పూర్తి రికార్డులతోపాటు దోషులకు జారీ చేసిన రెమిషన్ ఆర్డర్‌నూ సమర్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను సమర్పించేందుకు రెండు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

2002 నాటి గోద్రా రైలు దహనకాండ అనంతర అల్లర్ల సమయంలో బిల్కిస్‌ బానో అత్యాచార ఘటన చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురినీ దుండగులు హత్య చేశారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. వారు 15 ఏళ్లు కారాగారంలో గడిపారు. రెమిషన్‌ కింద ఇటీవల విడుదలయ్యారు. దీన్ని వివిధ సంఘాలతోపాటు రాజకీయ పార్టీలూ ఖండించాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version