వైద్యుల భద్రత కోసం 10మందితో టాస్క్ ఫోర్స్ : సుప్రీంకోర్టు

-

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో మహిళలు, యువ వైద్యుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు ఆలస్యంగా నమోదు చేశారని పోలీసులను ప్రశ్నించింది. ప్రిన్సిపల్‌ ఏం చేస్తున్నారు? ఆత్మహత్యగా ఎందుకు ప్రకటించారని నిలదీసింది. ఎల్లుండిలోపు అఫిడవిట్‌ దాఖలు చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వైద్యుల భద్రత కోసం జాతీయ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. 10 మంది సభ్యులతో జాతీయ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌.కె.శరిన్‌ ఈ టాస్క్ఫోర్స్కు అధ్యక్షత వహిస్తారని తెలిపింది.

సుప్రీంకోర్టు టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు

టాస్క్ఫోర్స్ అధ్యక్షుడిగా సర్జన్‌ వైస్‌ అడ్మిరల్‌ ఆర్‌.కె.శరిన్‌

సభ్యులుగా.. ప్రముఖ వైద్య నిపుణుడు, ఏఐజీ ఎండీ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి

ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్‌కు చోటు

డా. ప్రతిమామూర్తి, నిమ్‌హాన్స్‌ బెంగళూరు

డాక్టర్ గోవర్ధన్ దత్‌పూరి, డా. సౌమిత్ర రావత్

ఎయిమ్స్ దిల్లీ కార్డియాలజీ హెడ్‌ ప్రొఫెసర్ అనితా సక్సేనా

డీన్ గ్రాంట్ మెడికల్ కాలేజ్ ముంబై ప్రొఫెసర్ పల్లవి సప్రే

ఎయిమ్స్‌ న్యూరాలజీ విభాగం డాక్టర్ పద్మ శ్రీవాస్తవ

కేబినెట్, కేంద్ర హోం, ఆరోగ్య శాఖల కార్యదర్శులు

నేషనల్ హెల్త్ కమిషన్ ఛైర్‌పర్సన్‌

Read more RELATED
Recommended to you

Latest news