జీవిత ఖైదు అంటే జీవితాంతం శిక్ష అనుభవించాలా?.. సుప్రీంకోర్టులో పిటిషన్

-

జీవిత ఖైదు అంటే జీవితాంతం శిక్ష అనుభవించాలా? లేక నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ) సెక్షన్‌ 432ను ఉపయోగించి దాన్ని తగ్గించడం లేదా రెమిషన్‌ ఇవ్వడం చేయొచ్చా. ఈ విషయాన్ని స్పష్టం చేయాలంటూ సుప్రీం కోర్టులో ఓ పిటిషన్‌ దాఖలైంది. దీన్ని విచారించేందుకు కోర్టు అంగీకరించింది.

మూడు హత్య కేసుల్లో దోషిగా తేలి యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. అతడికి కింది కోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చిన దిల్లీ హైకోర్టు..  జీవితాంతం జైల్లోనే ఉండాలంటూ ఆదేశించింది. యావజ్జీవ శిక్ష కింద మరణించే వరకూ జైల్లో పెట్టడమంటే నేరస్థుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని పిటిషనర్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు రెమిషన్‌ కింద అందించే శిక్ష తగ్గింపు అవకాశాలను వారికి దక్కకుండా చేయడమేనని పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందన తెలియజేయాలంటూ ధర్మాసనం దిల్లీ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news