ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో 100 శాతం వీవీప్యాట్ల (VVPAT) స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లపై సుప్రీం కోర్టు తీర్పును ఇచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లను అన్నింటిని కొట్టివేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. ఏప్రిల్ 24వ తేదీన వాదనల నేపథ్యంలో సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.
వందశాతం సరిపోల్చాలంటూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించిన సుప్రీం.. ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని పేర్కొంటూ తీర్పు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం రోజున సుప్రీంకోర్టు తీర్పును వెలువరించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెల్లడించింది.