IPL 2023 : నవీన్ కు దూలతీర్చిన ముంబై ప్లేయర్లు

-

IPL 2023 : ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోపై ముంబై 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో… స్టోయినిస్ 40 మినహా మిగతా బ్యాటర్లు విఫలం అవడంతో 101 పరుగులకే ఆల్ అవుట్ అయింది. ముంబై బౌలర్లలో మద్వాల్ 5 వికెట్లు, జోర్డాన్, పియూష్ చేరో వికెట్ తీశారు. లక్నోలో ముగ్గురు బాటర్లు రన్ అవుట్ అయ్యారు.

ఈ విజయంతో ముంబై క్వాలిఫైయర్-2 లో గుజరాత్ తో తలపడునుంది. ఓటమిపాలైన లక్నో ప్లేఆఫ్ నుంచి నిష్క్రమించింది. అయితే.. LSG, ముంబై మ్యాచ్ అనంతరం ‘sweet mangoes’ అనే హ్యాష్ ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. sweet season of mangoes అంటూ MI ప్లేయర్స్ సందీప్, విష్ణు వినోద్ ఓ ఫోటోను ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ఇది LSG ప్లేయర్ నవీన్ ఉల్ హక్ కు కౌంటర్ గా పోస్ట్ చేసినట్లు నెటిజన్లు చెప్పుకుంటున్నారు. కోహ్లీతో గొడవ అనంతరం RCB బాగా ఆడనప్పుడు నవీన్ ‘sweet mangoes’ అంటూ ఇన్ స్టాలో స్టోరీస్ పెట్టిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version