పర్యటకుల కి గుడ్ న్యూస్. తాజ్ మహల్ ని చూడాలనుకుంటే ఇదే సరైన సమయం. ఎందుకంటే ఇప్పుడు తాజ్ మహల్ ని ఫ్రీగా చూడొచ్చు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం 27 నుండి మూడు రోజుల పాటు ఫ్రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలిపారు. ఇక దీని కోసం పూర్తి వివరాల్లోకి వెళితే..
ఫిబ్రవరి 27, 2022 నుంచి మార్చి 1, 2022 వరకు టూరిస్ట్స్ ఫ్రీగా తాజ్ మహల్ ని చూడొచ్చు. ఐదవ ముఘల్ ఎంపరర్ షా జహాన్ 367 వ వర్ధంతి సందర్భంగా పర్యాటకులకు ఈ మూడు రోజుల పాటు ఫ్రీగా తాజ్ మహాల్ ని చూసే అవకాశాన్ని ఇచ్చారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా టూరిస్టులకు ఫ్రీ పాసులు కూడా ఇస్తూ ఉంటారు.
అయితే ఈ మూడు రోజులు మాత్రమే కాకుండా వరల్డ్ టూరిజం డే నాడు కూడా ఫ్రీగా తాజ్ మహాల్ ని చూసే అవకాశం కల్పిస్తారు. డాక్టర్ రాజకుమార్ పటేల్ మధ్యాహ్నం 2 నుంచి సూర్యాస్తమయం అయ్యే వరకు కూడా విజిటర్లు రావొచ్చని చెప్పారు.
మర్చి ఒకటి ఉదయం నుండి సాయంత్రం వరకూ టూరిస్టులు రావచ్చని చెప్పారు. పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే తాజ్ మహాల్ ని ఫ్రీగా చూడొచ్చు కాబట్టి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే సెక్యూరిటీని కూడా టైట్ చేశారు.