తాజ్ మహల్ సందర్శనానికి రేపటి నుండి అనుమతులు…

-

కరోనా కారణంగా అన్నీ మూతబడ్డాయి. మార్చి 22వ తేదీ నుండి మొదలుకుని కొన్ని నెలల పాటుగా అన్నీ మూతబడి ఉన్నాయి. టూరిస్ట్ ప్రదేశాలైతే చెప్పక్కర్లేదు. ప్రపంచంలో కరోనా కారణంగా భారీగా నష్టపోయిన రంగం ఏదైనా ఉందంటే అది టూరిస్ట్ రంగమే అని చెప్పవచ్చు. ఐతే ఇప్పుడిప్పుడే అన్నీ తెరుచుకుంటున్నాయి. కరోనా ఉధృతి పెరుగుతున్నా అన్ని కార్యకలాపాలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజ్ మహల్ సందర్శనానికి అనుమతులు లభించాయి. సెప్టెంబర్ 21వ తేదీ నుండి తాజ్ మహల్ ని సందర్శించవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.

ఐతే రోజుకి కేవలం 5000మందికి మాత్రమే అనుమతులు ఇస్తారట. ఐతే సందర్శనకి వచ్చిన వారు అన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఒకరికి మరొకరికి మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలట. ఫోటో తీసుకున్నా కూడా ఈ నియమం వర్తిస్తుందట. నగదు చెల్లింపులకి అనుమతి లేదట. ఆన్ లైన్ చెల్లిపులకి మాత్రమే అనుమతి ఉంటుందట.

Read more RELATED
Recommended to you

Latest news