ఆఫ్ఘ‌నిస్తాన్‌లోని హిందువుల భ‌ద్ర‌త గురించి తాలిబ‌న్ల హామీ.. ఏమ‌న్నారంటే?

-

ప్ర‌పంచం వ్యాప్తంగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పేరు ఎంత‌లా వినిపిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అక్క‌డ అధికారంలోకి వ‌చ్చిన తాలిబన్ల సంక్షోభంపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర‌మైన చర్చ జరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆఫ్ఘన్ దేశః పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయింది. దీంతో ల‌క్ష‌లాది మంది ప్రజలు భయాందోళనతో దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నారు. కాగా ఆ దేశంలోని మ‌న హిందువులు, సిక్కులు, భారతీయులు ఉండ‌టంతో వారి భ‌ద్ర‌త గురించి ఆందోళ‌న మొద‌లైంది. ఇక ఇక్క‌డ‌కు వ‌చ్చేందుకు మన దేశ ప్రభుత్వాలను వారు వేడుకుంటున్నారు.

విష‌యం ఏంటంటే ఆఫ్ఘ‌నిస్తాన్ లోని ఓ గురుద్వార్ లోని ఆశ్రయంలో దాదాపుగా మూడువందల మంది సిక్కులు, హిందువులు ఆశ్ర‌యం పొందుతున్న‌ట్టు తెలుస్తోంది. కాగా వారి జాడ తెలుసుకున్న తాలిబన్లు వారితో చ‌ర్చించి వారి భద్రతకు భరోసా క‌ల్పిస్తామ‌ని తెలిపారు. ఇక ఇందులో పెద్ద తాలిబన్ నాయకులు పాల్గొని హిందువులు, సిక్కుల భద్రత గురించి స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చార‌ని స‌మాచారం.

ఇక ఇదే విషయాన్ని అకాలీదళ్ ప్రతినిధి, ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు అయిన మంజీందర్ సింగ్ సిర్సా త‌న అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్టు చేసి ఆ విష‌యాల‌ను వెల్లడించారు. ఇక ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో రాజకీయ, సైనిక మార్పులు దారుణంగా ఉన్నా కూడా అక్క‌డ హిందువులు, సిక్కులు సురక్షితంగా జీవిస్తార‌ని తాము బ‌లంగా న‌మ్ముతున్న‌ట్టు ఆయన ట్వీట్‌లో వివ‌రించారు. ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్‌లో బిక్కు బిక్కు మంటున్న హిందువులు, సిక్కులకు అన్ని ర‌కాలుగా సహాయ సహకారాలు అందిస్తామని MEA హామీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news