పెళ్లయిన వ్యక్తితో ప్రేమ… పేరెంట్స్ నో చెప్పారని.. !

ఓ యువతి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్న యువకుడిని ప్రేమించింది. అతడితోనే పెళ్లి చేయాలని ఇంట్లో పట్టు పట్టింది. కానీ కుటుంబ సభ్యులు వారి పెళ్లికి నిరాకరించడంతో చివరికి ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చిత్రదుర్గ జిల్లా హిరియురు తాలూకా కోనికేరే గ్రామంలో చోటు చేసుకుంది. చెళ్ళ కెరే తాలూకా పరశురామ పుర గ్రామానికి చెందిన తిప్పేస్వామి.. తిరువూరు తాలూకా గూడవల్లి గ్రామానికి చెందిన పుష్పలత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు.

అయితే తిప్పేస్వామి కి అప్పటికే వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ మూడేళ్ల నుండి తిప్పే స్వామి పుష్పలత ఒకరిని ఒకరు గాడంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే యువతి తన ప్రియుడితో వివాహం జరిపించాలని తల్లి తండ్రులను కోరింది. కానీ వారు నిరాకరించడంతో ప్రియుడితో కలిసి కొనికెరె వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.