వర్షాలతో తమిళనాడు అస్తవ్యస్తం.. రంగంలోకి ఆర్మీ, నేవి, వైమానిక దళాలు

-

భారీ వరదల కారణంగా తమిళనాడులో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కుండపోత వర్షాలు ఆ రాష్ట్రాన్ని వణికిస్తున్నాయి. అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రంగంలోకి దిగిన ఆర్మీ, నేవీ, వైమానిక దళాలు రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేశాయి. దాదాపు 800 మంది ప్రయాణికులు తూతుకూడిలోని ఓ రైల్వేస్టేషన్‌లో చిక్కుకుపోగా వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు విపత్తు దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ప్రస్తుతం భారీస్థాయిలో ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసు బలగాలను మోహరించింది ప్రభుత్వం. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించింది.

భారీ వర్షాల కారణంగా పాపనాశం, పెరుంజని, పెచుపారై డ్యాములు నిండుకుండలా మారాయి. దీంతో ఈ డ్యాముల నుంచి నీటిని వదలడం వల్ల తిరునెల్వేలి, తూతూకుడి, తెన్కాసి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీగా వరద చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు పశ్చిమ కనుమల్లోని కొండచరియలు విరిగిపడి తమిళనాడు, కేరళ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ దెబ్బతింది. కొండచరియలను తొలగించే పనులు చేపట్టామని, పూర్తైన తర్వాతే వాహనాలను అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news