అయోధ్యలో రూ. 650 కోట్లతో ‘మ్యూజియం ఆఫ్ టెంపుల్స్’

-

దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనాలన్నీ ఒకే చోట దర్శనం ఇవ్వనున్నాయి. అదెక్కడో కాదు.. బాలరాముడు కొలువైన అయోధ్యలో. ఈ మేరకు అయోధ్యలో రూ.650 కోట్లతో ‘మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌’ నిర్మాణానికి టాటా సన్స్‌ చేసిన ప్రతిపాదనకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధ్యక్షతన మంగళవారం రోజున జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ మేరకు అంగీకారం తెలిపింది. అనంతరం సంబంధిత వివరాలను పర్యావరణ శాఖ మంత్రి జైవీర్‌ సింగ్‌ మీడియాకు వెల్లడించారు.

‘మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌’ కోసం రూ.1 నామమాత్రపు అద్దె ప్రాతిపదికన టూరిజం శాఖకు సంబంధించిన స్థలాన్ని 90 ఏళ్లపాటు లీజుకు ఇవ్వనున్నామని జైవీర్ సింగ్ తెలిపారు. టాటా సన్స్‌ గతంలోనే ఈ ప్రతిపాదనలను కేంద్రం దృష్టి తీసుకెళ్లగా, యూపీ ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించిందని వెల్లడించారు. ఇందులో భాగంగా దేశంలోని ప్రముఖ ఆలయాల నమూనాలను ఇక్కడ తీర్చిదిద్దనున్నట్లు వివరించారు. దీంతోపాటు అయోధ్యలో మరో రూ.100 కోట్లతో టాటా సన్స్‌ చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకూ మంత్రవర్గం అమోదం తెలిపినట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version