లోక్ సభ స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లా

-

48 ఏళ్ల తర్వాత తొలిసారి బుధవారం లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక జరిగింది. లోక్‌సభ స్పీకర్‌ పదవి కోసం అధికార ప్రతిపక్షాల నుంచి అభ్యర్థులు బరిలో ఉండటం వల్ల ఎన్నిక నిర్వహించారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లా రెండోసారి ఎన్నికయ్యారు.  ప్రొటెం స్పీకర్‌ బర్తృహరి మెహతాబ్ స్పీకర్ ఎన్నిక నిర్వహించారు. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్​డీఏకు 293 మంది, ఇండియాకు 233 మంది సభ్యులున్నారు. ఈ నేపథ్యంలో ఓంబిర్లా ఎన్నిక లాంఛన ప్రాయమైంది.

మూడోరోజు లోక్​సభ సమావేశాలు ప్రారంభం కాగానే లోక్‌సభ స్పీకర్‌గా ఓంబిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధాని మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని రాజ్‌నాథ్‌ సింగ్‌తో పలువురు ఎన్డీయే ఎంపీలు బలపరిచారు. మరోవైపు ఇండియా కూటమి తరఫున కె.సురేష్‌ పేరును ప్రతిపాదించిన అనంతరం ప్రొటెం స్పీకర్‌ ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఎంపీలు మూజువాణి ఓటుతో స్పీకర్‌గా ఓంబిర్లాను ఎన్నుకున్నారు. అలా ఓం బిర్లా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. అనంతరం ఆయనకు ప్రధాని మోదీ సహా ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version