లంచాలకు ఉద్యోగాలు.. 16 మందిపై వేటు వేసిన టీసీఎస్

-

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (TCS) తాజాగా 16 మంది ఉద్యోగులపై వేటు వేసింది. కంపెనీతో వ్యాపారం చేస్తున్న ఆరుగురు విక్రేతలను నిషేధించింది. లంచాలకు ఉద్యోగాలు (టీసీఎస్ రిక్రూట్​మెంట్) స్కామ్​లో వీరి పాత్ర ఉన్నట్లు గుర్తించిన కంపెనీ వీరిని తొలగిస్తున్నట్లు తెలిపింది. ఈ స్కామ్​లో మొత్తం 19 మంది ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు గుర్తించామని.. వీరిలో 16 మందిని తొలగించామని టీసీఎస్ వెల్లడించింది. మరో ముగ్గురిని మాత్రం ‘రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌’ విధుల నుంచి బదిలీ చేసినట్లు పేర్కొంది. ఆరుగురు విక్రేతలు సహా వారి అనుబంధ యజమానులు కంపెనీతో ఎలాంటి వ్యాపారం చేయకుండా నిషేధం విధించినట్లు వివరించింది.

విక్రేతలతో కలిసి కొంత మంది ఉద్యోగులు కొత్త ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలకు పాల్పడుతున్నట్లు ఈ ఏడాది జూన్‌లో ఆరోపణలు వచ్చాయి. కంపెనీకి చెందిన ఓ వేగు ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఈ విషయం బయటకు వచ్చినట్లు టాక్. ప్రాథమిక దర్యాప్తులో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన కంపెనీ.. లోతైన విచారణకు కమిటీని నియమించి.. నాలుగు నెలల పాటు దర్యాప్తు జరిపింది. తాజాగా సదరు కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగానే కంపెనీ చర్యలు చేపట్టింది. ఈ స్కామ్​లో మేనేజర్‌ స్థాయి ఉద్యోగుల పాత్ర లేదని గుర్తించినట్లు టీసీఎస్‌ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news