పంజాబ్-హర్యానా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. సరిహద్దు ప్రాంతం శంభు వద్ద మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం మధ్యాహ్నం ‘ఢిల్లీ చలో’ మార్చ్ ను ప్రారంభించిన రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ లను వాడారు. కనీస మద్దతు ధర సహా 11 డిమాండ్ల సాధన కోసం 101 మంది రైతులు మార్చిలో పాల్గొన్నారు. డిసెంబర్ 6 నుంచి ఢిల్లీ వైపుగా వెళ్లేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. కానీ వరుసగా మూడోసారి కూడా రైతుల ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. కాంగ్రెస్ నాయకుడు, రెజ్లర్ బజరంగ్ పునియా శంభు సరిహద్దులో రైతులతో సమావేశమయ్యారు.
ఒకవైపు రైతులను ఆపడం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతూనే.. మరోవైపు బాష్పవాయువు ప్రయోగిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీ సరిహద్దులను పాకిస్థాన్ సరిహద్దుగా వ్యవహరిస్తోందన్నారు. ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపేందుకు నేతలు కేంద్రం అనుమతి తీసుకుంటారా?” అని ప్రశ్నించారు. రైతుల మార్చ్ ను దృష్టిలో పెట్టుకొని హర్యానా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేసింది. శనివారం ఉదయం ఆరు గంటలు మంచి 17వ తేదీ అర్థరాత్రి వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసినట్టు ప్రకటించింది ప్రభుత్వం.